News September 10, 2025
పనులు పెండింగ్‌లో ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పనిసరిగా EPTS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రికార్డులను వెంటనే అప్‌లోడ్ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News September 10, 2025
రాజమండ్రి: నేపాల్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నేపాల్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎవరైనా అక్కడ ఇబ్బందులు పడుతున్నట్లయితే, వారి వివరాలు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బుధవారం కోరారు. అటువంటి వారికి సహాయం అందించేందుకు రాజమండ్రిలోని కలెక్టరేట్‌లో 24×7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. అవసరమైనవారు 8977935611 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆమె కోరారు.
News September 10, 2025
కొవ్వూరులో కుళ్లిన మృతదేహం లభ్యం

కొవ్వూరులోని వైఎస్టీడీ మాల్ సమీపంలోని ఓ భవనంపై గుర్తుతెలియని వ్యక్తి కుళ్ళిన మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 9, 2025
యూరియా వాడకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్

యూరియా అతి వినియోగం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి విస్తృత ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ రూపొందించిన కొత్త యాప్‌ను రైతులందరూ ఉపయోగించుకునేలా చూడాలని, వాట్సాప్ సేవలను మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ సేవలపై రైతుల సంతృప్తి స్థాయి 30% మాత్రమే ఉందని ఆమె పేర్కొన్నారు.