News August 22, 2025
పనుల జాతరలో అదనపు కలెక్టర్ నగేష్

పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం హవేలిగణపూర్ మండలం చౌట్లపల్లిలో పనుల జాతర నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మి, ఎంపీడీఓ ఏపీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆసక్తి గల లబ్దిదారులు పశువుల కొట్టాలు, వ్యక్తిగత సోక్ పిట్‌ల కోసం దరఖాస్తులను అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు(నరేగ) పనుల జాతరలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.
Similar News
News August 22, 2025
మెదక్: రేపు డయల్ యువర్ డీఎం

మెదక్ ఆర్టీసీ డిపోలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ శుక్రవారం తెలిపారు. రేపు ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు తమ సందేహాల నివృత్తికి 7842651592 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సౌకర్యాలపై సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని డీఎం పేర్కొన్నారు.
News August 22, 2025
మెదక్: ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దు: ఎస్పీ

మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉన్నందున్న పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు ఇతర కార్యక్రమలు చేపడితే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టేవారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News August 22, 2025
మెదక్: ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా ఇంటర్ అధికారి మాధవి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా తమకు నచ్చిన కళాశాలలకు వెళ్లి దరఖాస్తులు చేసుకోవచ్చని ఆమె సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.