News March 30, 2025

పన్నులపై 50% వడ్డీ రాయితీ పొందండి: కలెక్టర్

image

జీవీఎంసీ పరిధిలో చెల్లించవలసిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ గుడ్‌న్యూస్ చెప్పారు. పన్ను మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 50 శాతం వడ్డీ మినహాయింపు ఇచ్చినట్లు ఆయన మంగళవారం తెలిపారు. మార్చి 31వ తేదీ లోగా బకాయిలు చెల్లించి ఈ లబ్ధి పొందాలని సూచించారు.

Similar News

News April 1, 2025

ఈనెల 3వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్‌: విశాఖ డిఈవో

image

జ్ఞానాపురంలోని సోఫియా జూనియర్ కళాశాలలో ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించనున్నట్లు డిఈవో ఎన్. ప్రేమ్ కుమార్ తెలిపారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లోకి సెల్ ఫోన్లు అనుమతించబోమని తెలిపారు. ఉపాధ్యాయుల కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 900 మంది ఉపాధ్యాయులు, అధికారులు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.

News April 1, 2025

‘విశాఖలో చంపి సాలూరులో వేలాడదీశారు’

image

సాలూరు మండలంలో గత నెల జరగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. సాలూరు మండలానికి చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. రాంబాబు యువతిని ఆరిలోవలోని ఓ రూములో చంపి ఫ్రెండ్స్ సాయంతో బైక్‌పై తీసుకెళ్లి సాలూరులోని జీడితోటలో చెట్టుకు చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యలా చిత్రీరించాడు.

News April 1, 2025

విశాఖ: పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్

image

విశాఖలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. జీవీఎంసీ జోన్-4 జేఎస్ఎం కాలనీలో పలువురు లబ్ధిదారులకు కలెక్టర్ పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మౌలిక వసతులపై ఆరా తీశారు. ఈరోజు సాయంత్రంలోగా శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

error: Content is protected !!