News February 16, 2025
పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News November 12, 2025
ఆదిలాబాద్ పోస్టుల వివరాలు ఇవే.!

ADB జిల్లాలోని కస్తూర్బా గాంధీ విద్యాలయలు, బాలికల హాస్టల్ అనుబంధ మోడల్ స్కూల్‌లల్లో ఖాళీగా ఉన్న బోధనేతర పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే KGBV ఆదిలాబాద్ రూరల్, అర్బన్, బేలా, మావల, తోషం మొత్తం ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే బాలికల హాస్టల్ బంగారిగూడలో నాలుగు పోస్టులు హెడ్ కుక్(1), అసిస్టెంట్ కుక్(2) వాచ్ ఉమెన్(1) నాలుగు పోస్టులు ఉన్నాయన్నారు.
News November 12, 2025
MBNR: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల టైమ్ టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాలను విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.palamuruuniversity.comలో చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
News November 12, 2025
హనుమాన్ చాలీసా భావం – 7

విద్యావాన గుణీ అతిచాతుర| రామ కాజ కరివే కో ఆతుర||
హనుమంతుడు గొప్ప విద్యావంతుడు. సద్గుణాలు కలవాడు. అత్యంత తెలివైనవాడు. ఎల్లప్పుడూ రామ కార్యాన్ని పూర్తి చేయడంలో ఉత్సాహం చూపిస్తాడు. ఆయన జ్ఞానం, నైపుణ్యం, సేవా తత్పరత అపారమైనవి. ఆయనలోని ఈ తత్వాలను మనం కూడా ఆదర్శంగా తీసుకుని, విద్య, గుణాలు, తెలివితేటలతో పాటు, మన జీవిత ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సిద్ధంగా ఉండాలి. <<-se>>#HANUMANCHALISA<<>>


