News January 25, 2026
పన్ను వసూళ్లలో ఎదురేలేదు..

ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ట్యాక్స్ వసూళ్ల విషయంలో హాంకాంగ్(13.1%), ఇండోనేషియా(13.1%), మలేషియా(12%)ను ఇండియా వెనక్కి నెట్టిందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలో వెల్లడించింది. ‘దేశ ట్యాక్స్-GDP నిష్పత్తి 19.6%గా ఉంది. పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట, GST, డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం వంటివి ఇందుకు కారణం. జర్మనీ-38%, అమెరికా-25.6%తో మెరుగ్గా ఉన్నాయి’ అని పేర్కొంది.
Similar News
News February 19, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు

బీబీనగర్‌లోని AIIMS 3పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి డిగ్రీ, డిప్లొమా, BSc(నర్సింగ్), GNM, BSc(రేడియోలాజికల్ ఇమేజింగ్ టెక్నిక్స్/EMT) అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు నెలకు రూ.30K, నర్సింగ్ ఆఫీసర్, టెక్నీషియన్‌కు రూ.40K చెల్లిస్తారు. సైట్:aiimsbibinagar.edu.in
News February 19, 2026
క్యాబేజీ సాగుకు అనుకూల నేలలు, విత్తన మోతాదు

కూరగాయల్లో అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. ఇక విత్తన మోతాదుకు విషయానికొస్తే ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్‌ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.
News February 19, 2026
మార్చి రెండో వారంలో TG బడ్జెట్ సమావేశాలు!

TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు MAR 2వ వారంలో ఉండొచ్చని తెలుస్తోంది. ప్రీ బడ్జెట్ మీటింగ్‌లు ఈనెలాఖరు వరకు ఉన్నాయి. ఆ తరువాతే తుది బడ్జెట్ ఖరారు చేయాలి. MAR మొదటి వారానికి ఈ ప్రక్రియ ముగుస్తుందని ‘ఫైనాన్స్’ వర్గాల అంచనా. అదయ్యాకే అసెంబ్లీ భేటీ ఉంటుందని చెబుతున్నాయి. ఈనెల 23న క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. కాగా తన కుమారుడి పెళ్లి MAR 5న ఉండడంతో ఆర్థిక మంత్రి భట్టి ఆ బిజీలో ఉన్నారు.


