News January 13, 2026

పప్పు గింజల పంటల్లో చిత్త పురుగులు.. నివారణ

image

మినుము, పెసర, అలసంద, కంది లాంటి పప్పు గింజల పైర్లు లేత దశలో(2-4 ఆకులు) ఉన్నప్పుడు చిత్త/పెంకు పురుగులు ఆశిస్తాయి. ఆకుల అడుగు భాగాల్లో చేరి రంధ్రాలు చేసి తినేస్తాయి. దీంతో మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. వీటి నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 5గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML మందులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. పంటలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ML లేదా ఎసిఫేట్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి.

Similar News

News February 13, 2026

ఇంపోర్టెడ్ ఆపిల్స్ తింటున్నారా?

image

‘ఇంపోర్టెడ్’ ఆపిల్స్ కంటే మన దేశీ కశ్మీరీ, హిమాచల్ ఆపిల్స్ ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. విదేశీ పండ్లు నెలల తరబడి నిల్వ ఉండటం వల్ల వాటిలోని విటమిన్-C 85% వరకు తగ్గిపోతుందని తెలిపారు. మన ఆపిల్స్‌లో గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, సహజమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయని వివరించారు. మెరిసే వ్యాక్స్ పూత ఉన్న విదేశీ పండ్ల కంటే తాజాగా దొరికే స్వదేశీ ఆపిల్స్ తీసుకోవాలని చెబుతున్నారు.

News February 13, 2026

శివ నామాలు అర్థాలు ‘‘శూలపాణి’’

image

శివుడి ఆయుధం త్రిశూలం. దీనిని చేతిలో ధరించిన వాడు కాబట్టి ఆయన ‘శూలపాణి’ అయ్యాడు. త్రిశూలంలోని మూడు కొనలు సత్వ, రజ, తమ గుణాలకు; అలాగే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంకేతం. వాటన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని లోకాన్ని రక్షించేవాడు శివుడు. మనలోని అరిషడ్వర్గాలను తన శూలంతో సంహరించి, మనల్ని సన్మార్గంలో నడిపిస్తాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నిరంతరం సిద్ధంగా ఉండే రక్షకుడు ఆయన.

News February 13, 2026

ఘన జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు

image

☛ దేశీ ఆవుపేడ 100kgలు ☛ దేశీ ఆవు మూత్రం 5లీటర్లు ☛ బెల్లం 2kgలు ☛ పప్పు దినుసుల పిండి 2kgలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా) ☛ గుప్పెడు పుట్టమట్టి
తయారీ: ఈ పదార్థాలను 100KGలు బాగా చివికిన పశువుల పేడలో వేసి చేతితో బాగా కలిపి, దానిపై 5 లీటర్ల ఆవుమూత్రాన్నిచల్లి, బాగా కలియబెట్టి కుప్పగా చేసి గోనెపట్టా కప్పాలి. 48 గంటల తర్వాత పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇలా 10 రోజులు ఆరబెడితే ఘనజీవామృతం సిద్ధమవుతుంది.