News November 28, 2025
పరకామణి దోషులకు శిక్ష పడాలి: YV సుబ్బారెడ్డి

పరకామణి అక్రమాలపై పక్కాగా విచారణ జరగాలని, దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలని TTD మాజీ ఛైర్మెన్ YV సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో CID విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ‘భక్తుల మనోభావాలను రాజకీయాలకు వాడవద్దు. తిరుమల లడ్డూ, పరకామణి ఘటనలను అడ్డం పెట్టుకొని వివాదాలు రేపుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని మేమే చెబుతున్నాం. నన్ను పిలిచినా, భూమనను పిలిచినా విచారణ కోసమే’ అని YV అన్నారు.
Similar News
News November 28, 2025
తంగళ్ళపల్లి: తల్లి మరణం భరించలేక తనయుడి ఆత్మహత్య

నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన తంగళ్ళపల్లికి చెందిన లలిత సిరిసిల్ల మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణించిన విషయం తెలుసుకున్న కొడుకు అభిలాష్ అదే మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అభిలాష్ సిరిసిల్లలోని సర్దాపూర్ బెటాలియల్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి, కుమారుడు మరణించడంతో గ్రామంలో తీవ్రవిషాదం చోటు చేసుకుంది.
News November 28, 2025
తంగళ్లపల్లి: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని చెక్పోస్టును సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News November 28, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.


