News September 8, 2025
పరవాడ డెక్కన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం.. కెమిస్ట్ మృతి

పరవాడ ఫార్మాసిటీ పరిధిలో గల డెక్కన్ రెడీమేడీస్ పరిశ్రమలో ఈనెల 5న విషవాయువు పీల్చి తీవ్ర అస్వస్థతకు గురైన సీనియర్ కెమిస్ట్ ఎల్.పోల్ నాయుడు గాజువాక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలాన్ని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి పరిశీలించి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News September 8, 2025
రాజీ దారిలోనే కేసుల పరిష్కారం: వరంగల్ సీపీ

ఈనెల 13న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఈరోజు సీపీ మాట్లాడుతూ.. రాజీ ద్వారా పరిష్కరించగల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. “రాజీయే రాజమార్గం” అని ఆయన స్పష్టం చేస్తూ, చిన్న కేసులను రాజీ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చన్నారు.
News September 8, 2025
14న లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి- SP జానకి

త్వరిత న్యాయం కోసం జాతీయ మెగా లోక్ అదాలత్ ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘రాజీయే రాజమార్గం.. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని, జుడీషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి, ఈ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని’ అన్నారు.
News September 8, 2025
నల్లబెల్లిలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం..!

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మండల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి జూనియర్ అసిస్టెంట్‌ను చికిత్స కోసం తరలించినట్లు సమాచారం.