News August 24, 2024
పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో కార్మికుడు మృతి

పరవాడ ఫార్మాసిటీలో ఈ నెల 23న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఝార్ఖండ్‌కు చెందిన రొయ్య అంగీరా(22) మృతి చెందాడు. సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులకు ఏ విధమైన న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News January 27, 2026
క్రికెట్ ఫ్యాన్స్ అలర్ట్: వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..

విశాఖలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టేడియం చుట్టూ 11 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం వైపు వాహనాలను ఆనందపురం, పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. నగరం నుంచి వెళ్లే వాహనాలు హనుమంతవాక, అడవివరం మీదుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. ప్రేక్షకులు నిర్ణీత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలన్నారు.
News January 27, 2026
మద్దిలపాలెంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

మద్దిలపాలెం ఆటోమోటివ్ జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఒక వ్యక్తిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందారు. నగరంలో ఆర్టీసీ బస్సులు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 26, 2026
విశాఖ: కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, స్థానిక ఎమ్మెల్యేలు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కూటికుప్పల సూర్యారావు, సీపీ శంఖబ్రత బాగ్చి ఉన్నారు. చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


