News November 27, 2024
పరవాడ: ఫార్మా కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి

పరవాడ ఫార్మాసిటీలో గల ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీకైన ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు CITU ఆరోపించింది. బుధవారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో CPM అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, CITU ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
ద్వారకానగర్: పిల్లలకు సెలవు.. పేరెంట్స్ వెళితే గేట్లకు సీల్

ద్వారకానగర్‌లోని రవీంద్ర భారతీ స్కూల్ 3 రోజులుగా తెరవలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టగా అసలు నిజం బయటపడింది. సిబ్బందికి ESI కల్పించకపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. వీటికి స్పందన లేకపోవడంతో స్కూల్‌కు సీల్ వేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకే మేనేజ్‌మెంట్ పిల్లలకు సెలవు ప్రకటించిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న DEO ప్రేమ్ కుమార్ ESI అధికారులతో మాట్లాడారు.
News July 9, 2025
సీఎంను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఉండవల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి, శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.
News July 9, 2025
‘అప్పుఘర్ వద్ద సిద్ధంగా గజఈతగాళ్ళు’

అప్పుఘర్ వద్ద గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నేడు జరగనున్న గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను నగర డిప్యూటీ పోలీస్ కమిషనర్లు అజిత జువేరి, లక్ష్మీనారాయణ పరిశీలించారు. అప్పుఘర్‌లో గిరిప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీలు ఏసీపీ నర్సింహామూర్తికి పలు సూచనలు చేశారు. విద్యుత్ వెలుగులతో పాటు బందోబస్తు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.