News August 26, 2024

పరవాడ సినర్జిన్ ఫార్మా ప్రమాదం.. కన్నీటిని మిగిల్చిన విషాదం

image

పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వంగర మండలం కోనంగిపాడు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం మృతుడి భార్య సునీత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్య కారణంగా అప్పటి నుంచి భార్య కుమారుడు శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News October 7, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు

image

శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News October 7, 2024

జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO

image

శ్రీకాకుళం జిల్లాలో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు

News October 7, 2024

ఇసుకను పొందడంలో సమస్యలా? ఈ నెంబర్లకు ఫోన్ చేయండి

image

ఇసుక‌ను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో కేటాయించ‌డం జ‌రుగుతోంద‌ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..ఇసుకను (https://www.sand.ap.gov.in) లో బుక్ చేసుకోవచ్చన్నారు. ఇసుక పొంద‌డంలో స‌మ‌స్య‌లు ఎదురైతే, 24 గంట‌లూ ప‌నిచేసే జిల్లా స్థాయి ఫెసిలిటేష‌న్‌ సెంట‌ర్‌ను సంప్రదించాలన్నారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 18004256012, వాట్సాప్ నెంబర్ 9701691657ను సంప్రదించవచ్చన్నారు.