News February 2, 2025
పరశురాముడు ప్రతిష్ఠించిన చివరి శివలింగం!

నల్గొండ జిల్లాలో అతిపురాతనమైన శైవక్షేత్రం చెర్వుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం. పరశురాముడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. క్షత్రియ సంహారానంతరం, తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు 108 శివలింగాలను ప్రతిష్ఠించగా అందులో ఇది చివరి శివలింగమని స్థలపురాణం. పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివసాయుజ్యాన్ని పొందాడట. పరశురాముని ఆత్మలింగము ఆలయం సమీపంలోని వేరొక గుహలో ఉంది.
Similar News
News November 10, 2025
జీఎస్టీ సంస్కరణలు.. 50% పెరిగిన నెక్సాన్ సేల్స్

జీఎస్టీ సంస్కరణలు, పండుగ సీజన్‌తో అక్టోబర్‌లో ఆటోమొబైల్ సేల్స్ పెరిగాయి. SUV మార్కెట్‌లో పోటీదారుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతీ సుజుకీ బ్రెజా సేల్స్‌ను టాటా నెక్సాన్ బీట్ చేసింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం అక్టోబర్‌లో ఈ మోడల్ సేల్స్ 50% పెరిగాయి. 2025 అక్టోబర్‌లో క్రెటా 18,381, నెక్సాన్ 22,083, బ్రెజా 12,072 యూనిట్లు సేల్ అయ్యాయి. నెక్సాన్ బేస్ మోడల్ రూ.7.32 లక్షల నుంచి మొదలవుతుంది.
News November 10, 2025
అందుకే నెక్లెస్ ధరించా: అల్లు శిరీష్

నిశ్చితార్థ వేడుకలో తాను నెక్లెస్ ధరించడంపై వస్తోన్న మీమ్స్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీశ్ స్పందించారు. ‘దీనికే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారో’ అంటూ వచ్చిన మీమ్‌కు కౌంటరిచ్చారు. ‘మన తెలుగు మీమర్లు చాలా ఫన్నీ. మన మహారాజులు & మొగలులు చోకర్లు(నెక్లెస్) ధరించేవారు. చోకర్లు మహిళలకే అనేది పాతకాలం. ఇది 2025.. మనం అలాంటి పరిమిత నమ్మకాల నుంచి బయటకు రావాలి’ అని ట్వీట్ చేశారు.
News November 10, 2025
కొత్తపేటకు రానున్న కేంద్ర బృందం

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేంద్ర ప్రభుత్వ పంట నష్టాల అంచనా బృందం మంగళవారం పర్యటించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద అధికారులతో కేంద్ర బృందం పర్యటనపై ఆయన సోమవారం చర్చించారు. మొంథా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాల పూర్తి వివరాలను, ఛాయాచిత్రాలతో సహా కేంద్ర బృందానికి తెలియజేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.


