News February 17, 2025

పరిగి టీచర్‌కు యాక్సిడెంట్

image

మొయినాబాద్ మం.లోని కనకమామిడి చౌరస్తాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పరిగిలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించే శ్రీను, అతడి భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

Similar News

News September 14, 2025

శ్రీకాకుళం: పండగల వేళ స్పెషల్ ట్రైన్స్

image

దసరా, దీపావళి సందర్భంగా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా చెన్నై సెంట్రల్(MAS), బరౌని(BJU) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.06039 MAS- BJU ట్రైన్‌ను నేటి నుంచి NOV 30 వరకు ప్రతి ఆదివారం, నం.06040 BJU- MAS ట్రైన్‌ను SEPT 17 నుంచి DEC 3 వరకు ప్రతి బుధవారం నడుపుతామన్నారు. ఈ ట్రైన్లు ఏపీలో రాజమండ్రి, ఏలూరు, విజయవాడతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.

News September 14, 2025

ఆ అమ్మవారికి పెరుగన్నమే ప్రీతి

image

నిర్మల్ జిల్లాలోని అడెల్లి పోచమ్మకు పెరుగన్నమంటే చాలా ప్రీతి. ఒకప్పుడు తీవ్రమైన కరవుతో అల్లాడిన ప్రజలను రక్షించడానికి శివుడు తన కుమార్తె పోచమ్మను ఇక్కడికి పంపాడని నమ్ముతారు. ఆమె కృప వల్లే ఇక్కడ వర్షాలు కురిసి, కరవు పోయిందని అంటారు. అందుకే అమ్మవారికి కోనేటి నీటితో వండిన అన్నంలో పెరుగు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయం వద్దే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తారు.

News September 14, 2025

ములుగు : సీఎం రేవంత్‌కు మేడారం సెంటిమెంట్

image

మేడారం అంటే సీఎం రేవంత్ రెడ్డికి సెంటిమెంట్. ఆయన రాష్ట్రంలో చేసిన హాత్ సే హాత్ జోడో యాత్రను మేడారం సమ్మక్క-సారలమ్మ సన్నిధానం నుంచి Feb 6, 2023లో ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్ర దోహదపడింది. ప్రభుత్వం ఏర్పడ్డ తొలిసారి 2024లో జరిగిన జాతరకు రూ.105కోట్లు ఇచ్చిన సీఎం ఈసారి రూ 236.2కోట్లతో మాస్టర్ ప్లాన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏర్పాట్ల పరిశీలనకు స్వయంగా రానున్నారు.