News December 18, 2025
పరిగి: తీవ్ర ఉద్రిక్తతల మధ్య మాదారంలో బోయిని రాములు విజయం

తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం<<18588851>> మాదారం సర్పంచ్<<>> ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోయిని రాములు విజయం సాధించారు. బుధవారం ఉదయం జరిగిన దాడిలో రాములుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను పరిగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన గ్రామంలో లేక పోవడంతో పార్టీ నాయకులు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
Similar News
News December 21, 2025
ఖమ్మం: లారీని ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి, 36 మందికి గాయాలు

తిరుమలాయపాలెం(M) చంద్రుతండా వద్ద KMM- WGL NHపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని RTC సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ నితీష్ అక్కడికక్కడే మృతి చెందగా.. బస్సులో ఉన్న 36 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని ఖమ్మం రూరల్ ACP తిరుపతిరెడ్డి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI జగదీష్ తెలిపారు.
News December 21, 2025
ఉగ్ర నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.!

ప్రకాశం టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. 2015లో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సేవలు అందించి, 2019లో టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకొని, జిల్లా అధ్యక్షుడి పదవిని దక్కించుకన్నారు.
News December 21, 2025
భూపేశ్ రాజకీయ ప్రస్థానం ఇదే.!

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా భూపేశ్ రెడ్డి ఎంపికైన విషయం తెలిసిందే. ఆయన 1985 అక్టోబర్ 17న జన్మించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2009-10లో కడప జిల్లా కాంగ్రెస్ యువజనాధ్యక్షుడిగా పనిచేశారు. మైలవరం ZPTCగా 2014లో గెలిచారు. 2021లో TDPలో చేరి జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకొని 2024లో MLA సీటు ఆశపడి నిరాశ పడ్డారు. పార్టీ అధిష్ఠానం మేరకు కడప ఎంపీగా పోటీ చేసి 66,000 ఓట్లతో ఓటమి చెందారు.


