News November 10, 2025
పరిగి: బ్రేకులు ఫెయిల్.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి

పరిగి ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెకానిక్ కుద్దూస్ (59) మృతిచెందారు. డిపోలో నుంచి బస్సు ఔటింగ్‌కు వెళ్తున్న సమయంలో ఎదురుగా నిలుచున్న కుద్దూస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. వచ్చే ఏడాది ఆయన రిటైర్ కావాల్సి ఉంది. కుద్దూస్ మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News November 10, 2025
జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.

డాక్టర్ ఇచ్చిన టిప్.. 360 కిలోల ఆర్డీఎక్స్ స్వాధీనం

భారీ ఉగ్ర కుట్రను జమ్మూకశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో 360 కిలోల ఆర్డీఎక్స్, AK-47 రైఫిల్, పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతనాగ్(కశ్మీర్)లో అరెస్టయిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా ఆస్పత్రిలో తనిఖీలు చేసి వీటిని కనుగొన్నారు. ఈ కేసులో మరో డాక్టర్ ముజామిల్ షకీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.