News August 30, 2025

పరిటాల రవి.. ఈ విషయం తెలుసా?

image

పరిటాల రవీంద్ర అందరికీ సుపరిచితుడిగా పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. 1958 ఆగస్టు 30న జన్మించిన ఆయన 1993 జూన్ 7న టీడీపీలో చేరారు. అప్పటి నుంచి సీమ రాజకీయాలు ఇంకో మలుపు తిరిగాయి. ఆ సమయంలో అరెస్టయిన ఆయన జైలు నుంచే నామినేషన్ దాఖలు వేశారు. అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
★ నేడు పరిటాల రవి జయంతి

Similar News

News August 30, 2025

8న గుర్తింపు లేని రాజకీయ పార్టీలతో సమావేశం: కలెక్టర్

image

తూ. గో జిల్లాకు చెందిన గుర్తింపు లేని రాజకీయ పార్టీల సంప్రదింపు వివరాలపై విచారణను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమక్షంలో సెప్టెంబర్ 8 న అమరావతిలో నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ప్రకటించారు. ఉ.10:50 గంటలకు భరత్ ప్రజా స్పందన పార్టీ, 11:00 గంటలకు భారతీయ చైతన్య పార్టీ, 11:30 గంటలకు జై ఆంధ్రా పార్టీ ప్రతినిధులు వివరాలతో వెలగపూడి సచివాలయం కార్యాలయానికి రావాలన్నారు.

News August 30, 2025

ప్రతి చెరువుకూ నీళ్లిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

image

AP: అసత్యాలు చెప్పడంలో YCP దిట్టని చిత్తూరు(D) పరమసముద్రం బహిరంగ సభలో CM చంద్రబాబు విమర్శించారు. ‘గేట్లతో సెట్టింగులేసి నీళ్లు తెచ్చినట్లు డ్రామాలాడటం చూశాం. మల్యాలలో మొదలైతే పరమసముద్రానికి నీళ్లు తెచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయి. రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాదని ముందే చెప్పా. ప్రతి చెరువుకూ నీళ్లిస్తాం’ అని తెలిపారు.

News August 30, 2025

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయం

image

TG: పంచాయతీల్లో రిజర్వేషన్లలో గత ప్రభుత్వం విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50% సీలింగ్‌ను మార్చనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.