News December 10, 2025

పరిటాల సునీతపై ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం

image

ప్రజలను ఉద్దరిస్తారని గెలిపిస్తే, దోపిడీ చేసుకునేందుకు లైసెన్స్‌ ఇచ్చినట్లు ఫీలవుతున్నారా? అని MLA పరిటాల సునీతను తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. ‘భర్త నాలుగు, నువ్వు మూడుసార్లు ఎమ్మెల్యే అయినా పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురాలేదు. మీ దాష్టీకాలను ప్రజలు గమనిస్తున్నారు. క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి వైదొలగండి’ అని డిమాండ్ చేశారు. రామగిరి MPP ఎన్నికను బాయ్‌కాట్‌ చేస్తున్నామని ప్రకటించారు.

Similar News

News December 12, 2025

నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163BNSS అమలు: ASF SP

image

అసిఫాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించే జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ASF SP నీతికా పంత్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలన్నారు.

News December 12, 2025

సీతంపేట: గ్రీవెన్స్ ద్వారా 15 వినతులు స్వీకరించిన ఐటీడీఏ పీవో

image

సీతంపేట ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 మంది గిరిజన ప్రజలు హాజరై తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో ఎస్.వి.గణేష్, ఈఈ రమాదేవి, డిప్యూటీ డీఈవో రామ్మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.

News December 12, 2025

ఐరాస అత్యున్నత పురస్కారం అందుకున్న IAS అధికారిణి సుప్రియా సాహూ

image

తమిళనాడు పర్యావరణం, వాతావరణ మార్పులు, అటవీశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సుప్రియా సాహూ ఐక్యరాజ్యసమితి అత్యున్నత పురస్కారమైన ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ 2025’ అవార్డు అందుకున్నారు. తమిళనాడులో ఉష్ణోగ్రతలు తగ్గించే పద్ధతులు ప్రవేశపెట్టడం, అటవీప్రాంత విస్తరణ, ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో పాటు బ్లూ మౌంటెయిన్‌, ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌ 2002 వంటివి ఆమె చేపట్టారు.