News September 11, 2025

పరిశుభ్రతతో అంటురోగాల నివారణ సాధ్యం: కలెక్టర్

image

నల్గొండ: పరిశుభ్రతతోనే టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలను నివారించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆమె ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో టైఫాయిడ్ జ్వరాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News

News November 4, 2025

NLG: ఆందోళన బాటలో ప్రైవేట్ కాలేజీలు

image

జిల్లాలు ప్రైవేట్ కళాశాలలు ఆందోళన బాట పట్టాయి. ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాబితాన్ని నిరసిస్తూ ఎంజీయూ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు కళాశాల నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. సోమవారం నుంచి తరగతులతో పాటు కళాశాలల బంద్ చేపట్టాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల ఎదుట బంద్ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.

News November 4, 2025

NLG: పత్తి కొనుగోళ్లలో కొర్రీలు.. రైతులు బేజారు!

image

జిల్లాలో ప్రారంభించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)పత్తి కొనుగోలు కేంద్రాలలో తేమ పేరుతో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పత్తి మిల్లు యజమానులు దళారులు కుమ్మక్కై సీసీఐ కేంద్రాలలో పత్తి మద్దతు ధర రూ.8,110 ఉండగా.. తేమ ఉందని చెబుతూ రూ. 6,500కే కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. తేమ శాతం 8 నుంచి 12% ఉంటేనే పత్తి కొంటామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

News November 4, 2025

ధాన్యం సేకరణ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులు తమ ప్రాంతాలలో సుడిగాలి పర్యటనలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును నిశితంగా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ (KGBV) వంటి విద్యాసంస్థలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆమె సమీక్షలో అధికారులకు సూచించారు.