News August 26, 2024
పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు: హోం మంత్రి

ఇకపై పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో కలిసి పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో పరిశ్రమల భద్రతను గాలికి వదిలి వేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 14, 2026
విశాఖ: అరుదైన రక్తం 57వసారి దానం

విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం(సేఫ్టీ) కర్రి శ్రీనివాస్ అరుదైన O-నెగటివ్ రక్తాన్ని 57వసారి దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. గుండెపోటుతో కేజీహెచ్‌లో శస్త్రచికిత్సకు సిద్ధమైన హిరమండలం ప్రాంతానికి చెందిన రామారావుకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆయన స్పందించారు. అవసరమైన వారికి రక్తం దానం చేయడం సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.
News February 14, 2026
ఆదివారం మాంసం విక్రయాలకు సెలవు: కమిషనర్

నగరంలో మాంసం చేపలు విక్రయాలకు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాంసం విక్రయాలు చేపట్టవద్దని, దుకాణాలు తెరవవద్దని, నిబంధనలు ఉల్లంఘింస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు వ్యాపారులకు ముందుగానే తెలిపి పర్యవేక్షణ చేయాలని సూచించారు.