News November 15, 2024
పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్
జిల్లా లెక్టర్ బాలాజీ శుక్రవారం మచిలీపట్నంలోని తన కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో సింగల్ డెస్క్ పాలసీ కింద 80 దరఖాస్తులు రాగా వాటిలో 52 దరఖాస్తులకు అనుమతులు రావడంతో వాటిని ఆమోదిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 28 దరఖాస్తులకు సంబంధించి 6 ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని దరఖాస్తులను పరిశీలించాలని కోరారు.
Similar News
News November 21, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో ఇటీవల నిర్వహించిన ఫార్మ్‌డీ కోర్సు 2, 3, 4వ ఏడాది పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ అధ్యాపక వర్గాలు సూచించాయి. ఈ పరీక్షల ఫలితాలకై యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని విద్యార్థులకు ఈ మేరకు ఒక ప్రకటనలో సూచించాయి.
News November 21, 2024
విజయవాడ: అరెస్టు భయంతో సూసైడ్
అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన నీలం సూర్యప్రభాస్(21)పై 15 కేసులున్నాయి. భార్య, కుమారుడితో ప్రభాస్ 3 నెలలుగా తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. ప్రభాస్‌ను గాలిస్తూ పోలీసులు ఇంటి వద్దకు వెళ్లారు. వారిని చూసి అరెస్టు చేస్తారని భయపడి బుధవారం ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
News November 21, 2024
కృష్ణా: బీపీఈడీ పరీక్షల ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు 2వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలు, రీవాల్యుయేషన్/పర్సనల్ వెరిఫికేషన్ వంటి వివరాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చూడాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.