News August 10, 2025
పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుపడుతన్నారు: మంత్రి

పరిశ్రమల స్థాపన కోసం సీఎం చంద్రబాబు పాటుపడుతుంటే, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాకు రావొద్దని జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఆదివారం జిల్లా తెలుగదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పనిచేస్తామంటే టీడీపీ ఎప్పుడూ అడ్డుకోలేదన్నారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు తేలేకపోయారని విమర్శించారు.
Similar News
News August 13, 2025
వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్: న్యాయమూర్తి

వచ్చే నెల 13న జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ చేయించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో పలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బీమా క్లైమ్‌లు, సివిల్ దావాలు ఇరు పార్టీల ఆమోదంతో రాజీ చేయించాలని సూచించారు. 12 ప్రమాద బీమా క్లెయిమ్‌లు రాజీకి వచ్చినట్లు స్పష్టం చేశారు.
News August 12, 2025
భారీ వర్షాలు.. అప్రమ్తతంగా ఉండాలని విజయనగరం కలెక్టర్ ఆదేశాలు

రానున్న 4 రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి సూచనలు వచ్చాయని, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఆదేశించారు. మండల ప్రత్యేకాధికారులు, మండలాధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి నష్టం వాటిళ్లకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
News August 12, 2025
నేడు 3.60 లక్షల మందికి అల్బెండజోల్ మాత్రలు: కలెక్టర్

విజయనగరం జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ళ మధ్య పిల్లలు, విద్యార్ధులు 3,60,000పై బడి ఉన్నారని, వీరందరికీ అల్బెండజోల్ మాత్రలు మంగళవారం మింగించాలని కలెక్టర్ అంబేద్కర్ సూచించారు. కలెక్టరేట్లో నేషనల్ డే వార్మింగ్ డే పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. మధ్యాహ్న భోజనం చేసిన అర గంట తర్వాత మాత్రలు మింగించాలన్నారు. ఏడాది వయసు వారికి అరముక్క, 2-19 ఏళ్ల వారికి పూర్తి మాత్ర వేయాలన్నారు.