News August 27, 2024

పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించి ఉద్యోగులు, కార్మికుల రక్షణకు ప్రాధాన్య‌తనివ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత నిర్వాహకులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాద ఘ‌ట‌న నేప‌థ్యంలో జిల్లాలోని ఫ్యాక్టరీలు, ప‌రిశ్ర‌మ‌ల నిర్వాహ‌కులకు పలు సూచనలు చేశారు. 28 వేల మంది వివిధ చోట్ల పని చేస్తున్నారన్నారు.

Similar News

News February 20, 2026

పరిహారం త్వరితగతిన మంజూరు చేయాలి: జేసీ

image

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం జేసీ నూరుల్ ఖమర్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇంటి స్థలం, అర్హత కలిగిన ఇతర ప్రయోజనాలను త్వరితగతిన మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 20, 2026

కర్నూలు: రెండు వారాల్లో పెళ్లి.. అంతలోనే విషాదం

image

కర్నూలు(D) గోనెగండ్ల మండలం ఐరన్ బండకు చెందిన టీడీపీ కార్యకర్త, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ బోయ నీలకంఠ(30) నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. మార్చి 5, 6వ తేదీలలో వివాహం జరగాల్సి ఉండగా ఈ ఘటనతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. నీలకంఠ మృతి పట్ల టీడీపీ మండల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News February 20, 2026

నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

image

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.