News March 21, 2025
పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చూడండి: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా, అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీసి రుణాల మంజూరు అంశాలను కలెక్టర్‌కు వివరించారు.
Similar News
News March 21, 2025
నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్‌లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్‌లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.
News March 21, 2025
నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్‌లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్‌ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.
News March 21, 2025
నెల్లూరు: ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో ఖాళీ అయిన విడవలూరు ఎంపీపీ, దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ZP సీఈవో విద్యారమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి ముందస్తుగా ఈ నెల 23వ తేదీలోగా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశామన్నారు.