News November 28, 2024

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలి: కలెక్టర్ చేతన్

image

శ్రీ సత్య సాయి జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పరిశ్రమలు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. 

Similar News

News September 18, 2025

ATP: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ప్రభుత్వ అధికారులు పనితీరు మెరుగుపరచుకుని సత్ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. భారీ పరిశ్రమలకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.

News September 18, 2025

ఆలూరు సాంబశివారెడ్డికి కీలక పదవి

image

అనంతపురం జిల్లా వైసీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డిని వైసీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా నియమిస్తూ ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సాంబశివారెడ్డిని స్టేట్ అడ్మిన్ హెడ్‌గానూ నియమించినట్లు చెప్పింది. ఈ నియామకంపై సాంబశివారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం చేయడానికి మరింత కృషి చేస్తానని పేర్కొన్నారు.

News September 18, 2025

గుంతకల్లుకు నటి నిధి అగర్వాల్

image

ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ ఈ నెల 22న గుంతకల్లుకు రానున్నారు. ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడానికి ఆమె రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’లో నటించిన ఆమె ప్రస్తుతం ‘ది రాజాసాబ్‌’ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు.