News February 25, 2025
పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా చేయూతనివ్వాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 26, 2025
భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)లో 206 ఉద్యోగాలకు <
వెబ్‌సైట్: https://www.aai.aero/en/careers/
News February 25, 2025
కరీంనగర్: స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్స్‌ల రిసీవింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూములను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.15 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి వస్తాయని దాని తగ్గ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇతరులను అనుమతించరాదని ఆదేశించారు.
News February 25, 2025
త్రిపురారం: గవర్నర్‌ని కలిసిన వస్రాం నాయక్

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన భారత దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుడు ధనావత్ వస్త్రం నాయక్, NTA ప్రతినిధి ధనావత్ జగదీష్ నాయక్‌తో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మంగళవారం కలిశారు. వస్రాం నాయక్‌కి ఆటలపై మక్కువ పెరగడానికి గల కారణాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రచారం చేయాలని, భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు.