News February 24, 2025
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: నిర్మల్ కలెక్టర్

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహనపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం బోర్డు పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News February 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 25, 2025
హనుమకొండ: వైన్స్, బార్, రెస్టారెంట్లు బంద్: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఈ నెల 25 నుంచి 27 వరకు హనుమకొండ జిల్లాలోని అన్ని మద్యం షాపులు, బార్, రెస్టారెంట్లు, కల్లు డిపోలు మూసి వేస్తున్నామని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
News February 25, 2025
నిజామాబాద్: మిర్చికి మాత్రం రూ.25 వేల మద్దతు ధర సాధించాలి: కవిత

‘ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతారా.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటారా.. ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. కానీ కచ్చితంగా రూ.25 వేల మద్దతు ధర సాధించాల్సిందే’ అని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మిర్చి ధరలు తగ్గగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి లొల్లి లొల్లి చేశారని గుర్తు చేశారు.