News February 24, 2026

పరీక్షలా? ఈ శ్లోకాలు చదవండి!

image

గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్|
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్|| (గణేష్ స్తోత్రం)
సరస్వతి స్తుతి:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా|
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమః||

Similar News

News February 27, 2026

కవితకు న్యాయం జరిగింది: కేటీఆర్

image

TG: మద్యం కుంభకోణం కేసులో కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘లిక్కర్ స్కామ్ సాకుతో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసు వల్ల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం BRS. ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే తేలిపోతుంది. కుట్రపూరిత కేసులను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

News February 27, 2026

వాట్సాప్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయా?

image

వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్‌ వచ్చింది. ఇకపై ‘స్టేటస్’ విభాగంలో యాడ్స్, ‘అప్‌డేట్స్’ ట్యాబ్‌లో ప్రమోటెడ్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. దీనివల్ల యూజర్‌కు అవసరమైన వ్యాపార సంస్థలతో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఈ మార్పుల వల్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి సురక్షితంగా ఉంటాయని తెలిపింది.

News February 27, 2026

2018 బ్యాచ్ గ్రూప్-1 ఆఫీసర్లకు ఎదురుదెబ్బ

image

AP: 2018 బ్యాచ్ గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమను అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన <<19238436>>ఉత్తర్వులను<<>> సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగా ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ‘ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగం చేయలేరా? ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది. సంతృప్తిగా ఉండండి’ అని పేర్కొంది.