News March 15, 2025
పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
Similar News
News November 13, 2025
32 కార్లతో సీరియల్ అటాక్స్‌కు కుట్ర?

ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబుల డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) సీరియల్ అటాక్స్‌కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లు సహా దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం.
News November 13, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 13, 2025
విజయవాడలో దారుణ హత్య

విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. విజయ టాకీస్ సమీపంలోని విన్స్ హాస్పిటల్లో పనిచేసే మహిళను ఆమె భర్త గురువారం మధ్యాహ్నం గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం భర్త సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని సీఐ ఆలీ తెలిపారు.


