News March 26, 2025
పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్‌ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..
Similar News
News March 29, 2025
ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: మంత్రి

ఖమ్మంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం V. వెంకటాయపాలెం గ్రామంలో బీటీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటికే అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.
News March 29, 2025
ఉగాదిని సంతోషంగా జరుపుకోవాలి: తుమ్మల

ఖమ్మం: కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. స్తంభాద్రి పురోహిత సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు లక్ష్మి, కమర్తపు మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాదు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
News March 29, 2025
నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

KMM: ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల సంబంధిత SC నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారంను సంబందిత ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.