News March 21, 2025
పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రతీక్ జైన్

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ కేంద్రంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు.
Similar News
News November 2, 2025
పెందుర్తిపై పీఠముడి వీడేనా?(1/1)

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై కూటమి సర్కార్ వేగం పెంచిన నేపథ్యంలో <<18179453>>పెందుర్తి సమస్య<<>> తెరపైకి వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన నూతన జిల్లాల ఏర్పాటులో పెందుర్తి నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు. పెందుర్తితోపాటు పెదగంట్యాడలోని మెజార్టీ ప్రాంతాలను జీవీఎంసీలో.. సబ్బవరం, పరవాడ మండలాలను అనకాపల్లి జిల్లాలో కలిపేశారు. ఒకే నియోజకవర్గం 2జిల్లాల్లో ఉండటంతో పరిపాలనాపరమైన అవసరాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News November 2, 2025
పెందుర్తిపై పీఠముడి వీడేనా?(1/2)

ఉమ్మడి జిల్లాలో సెమీఅర్బన్ నియోజకవర్గమైన పెందుర్తిలో ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునేందుకు పెద్దమొత్తంలో ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఫార్మా SEZ, దువ్వాడ సెజ్, NTPC, నేషనల్ లా, మారీటైం యూనివర్శిటీలున్నాయి. అయితే పెందుర్తికి 15 కి.మీ.దూరంలో ఉన్న విశాఖలో కాకుండా 34 కి.మీ.దూరంలో ఉన్న అనకాపల్లిలో విలీనం చేయడంపై గతంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరి కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
News November 2, 2025
వరంగల్: రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టాల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు కలెక్టరేట్‌కు రావద్దని కలెక్టర్ సూచించారు.


