News February 25, 2026

పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని TGTWRJC బాలికల, బాలుర జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను ఆమె ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రశ్నాపత్రాల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ, హాల్ టికెట్ల తనిఖీ కట్టుదిట్టంగా చేయాలని సూచించారు.

Similar News

News February 27, 2026

ఇవాళ పుట్టపర్తి రావొద్దు: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం పుట్టపర్తి కలెక్టరేట్లో ప్రతీ నెల 4వ శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేశామని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటన తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని కోరారు.

News February 27, 2026

బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి: సూర్య

image

బ్యాటర్లు అద్భుతంగా రాణించారని, బౌలింగ్ విభాగంలో ఇంకాస్త ‘క్లినికల్’గా ఉండాల్సిందని జింబాబ్వేపై విజయం తర్వాత టీమ్‌ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ అభిప్రాయపడ్డారు. జింబాబ్వే బ్యాటర్ బెన్నెట్ అద్భుతంగా ఆడారని, సండే WI తో మన బౌలర్లు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కోల్‌కతాలో విండీస్‌తో జరిగే సెమీఫైనల్ బెర్త్ పోరుకు తమ వ్యూహాలను మరింత పకడ్బందీగా సిద్ధం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

News February 27, 2026

ఆంథ్రోపిక్‌కు పెంటగాన్ అల్టిమేటం!

image

అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ప్రముఖ AI సంస్థ ‘ఆంథ్రోపిక్’కు డెడ్ లైన్ విధించింది. తమ Claude మోడల్‌ను మిలిటరీ అవసరాలకు, నిఘా పనులకు వాడుకోవడానికి అనుమతించాలని, లేదంటే ఫిబ్రవరి 27 సాయంత్రం కల్లా ₹1,600 కోట్ల కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించింది. కంపెనీని ‘సప్లై చైన్ రిస్క్’గా ప్రకటించి బ్లాక్ లిస్ట్‌లో పెడతామని అల్టిమేటం ఇచ్చింది. AIని యుద్ధానికి ఉపయోగించాలని ట్రంప్ సర్కార్ యోచిస్తోంది.