News March 21, 2025

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అన్నమయ్య కలెక్టర్

image

రాయచోటిలోని నేతాజీ సర్కిల్ దగ్గర గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ చామకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్, డీఈఓ, ఆ శాఖ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

Similar News

News March 28, 2025

ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

image

జిల్లాలో విశ్వావస నామ తెలుగు సంవత్సర ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో ఉగాది ఉత్సవ వేడుకలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్‌వో రాము నాయక్, తదితరులు ఉన్నారు.

News March 28, 2025

ఒంగోలు: వివాదాలకు కేంద్ర బిందువుగా బాలినేని

image

అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.

News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

error: Content is protected !!