News March 5, 2025
పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు: ADB రాజర్షి షా

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 31 పరీక్షా కేంద్రాల్లో 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 5, 2025
ఆదిలాబాద్: ఇద్దరు మహిళా దొంగలు ARREST

ఇద్దరు మహిళా దొంగలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన మైనా, జ్యోతి, వీరి భర్త తేజ్ షిండే మహారాష్ట్ర నుంచి రైలులో ఆదిలాబాద్ వచ్చి చోరీలు చేస్తూ తిరిగి వెళ్లిపోతున్నారు. మంగళవారం బస్టాండ్‌లో అనుమానస్పదంగా తిరుగుతుండగా ఆ ఇద్దరు మహిళలను SIవిష్ణుప్రకాశ్ అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. పరారీలో ఉన్న తేజ్ షిండే కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News March 5, 2025
ADB: పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉంటారని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలోనికి సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు.
News March 5, 2025
ADB జిల్లాలో కరెంట్ షాక్‌తో రైతు దుర్మరణం

కరెంట్ షాక్‌తో ఓ రైతు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పార్డి (కే) గ్రామానికి చెందిన ఉగ్గే హన్మంతు (50) తన చేనులో జొన్న పంటకు నీటిని పెట్టేందుకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో చేను వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతిని ఇంట్లో విషాదం నెలకొంది.