News November 12, 2024
పరీక్ష కేంద్రాలకు ముందుగానే రావాలి: NZB కలెక్టర్
ఆర్మూర్ మార్గంలో అడవి మామిడిపల్లి వద్ద ఆర్‌యూబీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిర్ణీత సమయం కంటే ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్‌యుూబీ పనులు జరుగుతున్నందున నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నిజామాబాద్ – ఆర్మూర్ మార్గంలో రాకపోకలు మళ్లించామన్నారు.
Similar News
News November 14, 2024
రెంజల్: కల్లు సీసాలో బల్లి కలకలం
కల్లు సీసాలో బల్లి కలకలం రేపిన ఘటన రెంజల్‌లో చోటుచేసుకుంది. బుధవారం మండల కేంద్రంలోని ఓ కల్లు బట్టిలో ఓ వ్యక్తి కొన్న కల్లు సీసాలో బల్లి ప్రత్యక్షమైంది. గమనించకుండా అతడు కల్లు తాగడంతో అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తోటి వారు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అధికారులు దుకాణదారుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు కోరుతున్నారు.
News November 14, 2024
దుబాయ్‌లో అమ్ధాపూర్ వాసి మృతి
బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామానికి చెందిన హరికృష్ణ (38) దుబాయ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హరికృష్ణ గత నెల అక్టోబర్ 24వ తేదీన బతుకు దెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్టోబర్ 31న రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదంలో మరణించాడు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రానున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 14, 2024
రేపు ఎడపల్లి మండలానికి మంత్రి జూపల్లి రాక
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో రేపు పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మంత్రి జూపల్లి పర్యటన ఎడపల్లి మండలంలో సైతం ఉండనున్నట్లు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహా తెలిపారు. మంత్రి పర్యటన నేపథ్యంలో సొసైటీ ఛైర్మన్, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సొసైటీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు.