News March 21, 2025

పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్, డీఈఓ ప్రణీత తదితరులు ఉన్నారు.

Similar News

News November 4, 2025

ఆదిలాబాద్: ‘బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేం’

image

ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు ఏళ్లుగా పేరుకుపోతున్నాయని బిల్లులు మంజూరు చేయకుంటే పనులు చేయలేమని బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామారావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతోపాటు పంచాయతీ రాజ్ ఎస్ఈ జాదవ్ ప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు. బిల్లులు రాకపోవడం మూలంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని, మిగిలిన పనులు చేయలేని పరిస్థితి ఉందని వివరించారు.

News November 4, 2025

మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి: ఆదిలాబాద్ ఎస్పీ

image

మహిళలు, విద్యార్థినుల రక్షణ, భద్రతపై జిల్లా పోలీసుల ప్రత్యేక దృష్టి సారిస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో “పోలీస్ అక్క” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాల,కళాశాలను మహిళ పోలీసు సందర్శించాలని సూచించారు. పోలీస్ ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

News November 4, 2025

ఆదిలాబాద్: మంత్రి పొన్నంను కలిసిన జిల్లా గౌడ సంఘం నేతలు

image

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను జిల్లా గౌడ సంక్షేమ సభ్యులు కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి గౌడ కులస్థుల సమస్యలు, గౌడ కమ్యూనిటీ హాల్, వసతి గృహం ఏర్పాటు గురించి విన్నవించారు. ప్రభుత్వం గౌడ్ల సమస్యలు, బీసీ రిజర్వేషన్ల సాధన, కుల గణన వంటి అంశాలపై కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. రమేశ్ చందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, నాందేవ్, లక్ష్మీనారాయణ, చరణ్ గౌడ్ ఉన్నారు.