News December 23, 2025

పరుగు పందెంలో సత్తా చాటిన జిల్లా అథ్లెట్లు

image

కామారెడ్డిలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు సాగాయి. ఈ పోటీలను జిల్లా అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. వీరు వచ్చే ఏడాది JUN 2న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తారు.

Similar News

News December 23, 2025

శ్రీకాకుళం టుడే టాప్ న్యూస్ ఇవే..!

image

శ్రీకాకుళం: సమ్మె నోటీసు అందించిన కార్మికులు
టెక్కలిలో ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకోవాలి: మంత్రి అచ్చెన్నాయుడు
స్వర్ణాంధ్ర లక్ష్యంలో జిల్లా ముందుండాలి: కలెక్టర్
కార్గో ఎయిర్ పోర్టుకు భూములు ఇవ్వం
అన్ని వర్గాలు ప్రజలు ప్రేమాభిమానంతో మెలగాలి: ఎమ్మెల్యే గోవిందరావు
శ్రీకాకుళం: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి
సరుబుజ్జిలి: చిగురువలసలో డయేరియా రోగుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు

News December 23, 2025

రేపు మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ పర్యటన

image

రేపు మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చేగుంట మండల కేంద్రంలో గల రైతు వేదికలో మంత్రి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు.

News December 23, 2025

నాగర్‌కర్నూల్‌: టెట్‌ కోసం ఉపాధ్యాయుల పుస్తకాల కుస్తీ

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టెట్‌ (TET) ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో ఉమ్మడి జిల్లాలోని సుమారు 5,600 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. జనవరి 3 నుంచి ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షల కోసం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతున్నారు. పాఠశాల విధులతో పాటు పరీక్షల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.