News February 5, 2026
పరుచూరి ‘వ్యక్తిత్వ వికాస’ మంత్రం ఇదే!

మనిషి వ్యక్తిత్వంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన ట్వీట్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఇతరులను కలిసినప్పుడు ప్రవర్తన మర్యాదగా ఉండాలి. భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహనతో భయం లేకుండా ముందడుగు వేయాలి. మనిషి ఎదుగుదలకు క్రమశిక్షణ, సంస్కారం ఎంతో అవసరం’ అని ఆయన పేర్కొన్న తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Similar News
News February 19, 2026
పంటల్లో చెదపురుగుల నివారణకు మరికొన్ని సూచనలు

పొలం గట్లపై ఉండే చెదపురుగుల స్థావరాలను గుర్తించి నాశనం చేయాలి. సరిగా కుళ్లని సేంద్రియ ఎరువు చెదపురుగులను ఆకర్షిస్తుంది. అందుకే బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఎరువుగా వాడాలి. పంట విత్తేసమయంలో KG విత్తనానికి క్లోరిపైరిఫాస్ 6ml కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలను చెద నుంచి కాపాడవచ్చు. చెరకు పంటలో చెదల నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2mlను కలిపి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత మొక్క మొదల్లో వేయాలి.
News February 19, 2026
ధ్యానంతో దైవ దర్శనం సాధ్యమని చెప్పిన మహర్షి

ఉపనిషత్తుల్లో పేర్కొన్నవారిలో ఆరుణి మహర్షి ఒకరు. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన బోధనలు బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ఆయన ఆధ్యాత్మిక గురువు. ఈయన వద్దే సుప్రసిద్ధ యాజ్ఞవల్క్య మహర్షి విద్యను అభ్యసించారు. ఆత్మ, శరీరం, అంతరాత్మతో దేవుడిని తెలుసుకోవచ్చని శిష్యులకు వివరించేవారు. తన కుమారుడైన శ్వేతకేతువుకు తత్త్వమసి వంటి ఆధ్యాత్మిక రహస్యాలను బోధించి, ధ్యానంతో దైవదర్శనం కలిగించారు.
News February 19, 2026
ESIC మెడికల్ కాలేజీ& హాస్పిటల్‌లో ఉద్యోగాలు

రాంచీలోని <


