News April 2, 2025
పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరుగురు స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోవడంతో వంశీ తల్లిదండ్రులు బోరున విలపించారు.
Similar News
News April 3, 2025
ట్రంప్ టారిఫ్స్: అత్యధికంగా ఈ దేశాలపైనే

* సెయింట్ పిర్రే అండ్ మిక్‌లెన్- 50%
* లెసోతో-50%
* కాంబోడియా- 49%
* లావోస్-48% *మడగాస్కర్-47%
* వియత్నాం-46%
* శ్రీలంక-44% *మయన్మార్-44%
* సిరియా- 41% * ఇరాక్-39%
*బంగ్లాదేశ్-37% * చైనా-34% *పాకిస్థాన్-29%
>>ఇండియాపై 26%
News April 3, 2025
ప్రకాశం: కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

స్థల వివాదం నేపథ్యంలో CISF కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై దాడి చేశారు. ఈ ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల మండలం గవినివారిపాలెంలో జరిగింది. భరత్, వీరయ్య, లక్ష్మీనారాయణకు, నాగేశ్వరరావుకు స్థల గొడవలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్‌పై మరో ఇద్దరితో కలిసి వారు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో బుధవారం 5గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
News April 3, 2025
ALERT: నేడు రాష్ట్రంలో భిన్న వాతావరణం

AP: రాష్ట్రంలో నేడు భిన్న వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అల్లూరి, ప్రకాశం, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో ఎండలు మండిపోతాయని వెల్లడించింది. భిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.