News February 1, 2025

పర్చూరు టీడీపీ నగర అధ్యక్షుడు మృతి

image

పర్చూరు TDP నగర అధ్యక్షుడు అగ్నిగుండాల వెంకటకృష్ణ గుండెపోటుతో మృతి చెందాడు. ఈయన పర్చూరు MLA ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు. TDPలో క్రియాశీలక వ్యక్తి అని పలువురు తెలిపారు. పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని MLA ఏలూరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా వెంకటకృష్ణ సతీమణి శ్రీలక్ష్మీ నెలరోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నెల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Similar News

News September 17, 2025

సంగారెడ్డి: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్

image

ఈ నెల 20న సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, పాఠశాల అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ఆయన సూచించారు. పీటీఎంకు సంబంధించిన వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు.

News September 17, 2025

స్మార్ట్‌ కార్డుల్లో పేరు సరిదిద్దాం: జేసీ

image

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరును స్మార్ట్‌ కార్డుల్లో చేర్చినట్లు జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందని చెప్పారు. ఇకపై ఏ ఒక్క కార్డును స్కాన్ చేసినా, ‘అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా’ అని కనిపిస్తుందని ఆమె స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ అభిమానుల మనోభావాలను గౌరవించామని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.

News September 17, 2025

PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

image

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్‌లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.