News January 1, 2025

పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్‌ఛార్జ్ మార్పు

image

పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా గాదె మధుసూదన రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాదె మధుసూదన రెడ్డి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కుమారుడు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా యడం బాలాజీ ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News January 3, 2025

ప్రకాశం: అరుదైన మొక్కల స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్

image

పక్కాగా అందిన సమాచారంతో అరుదుగా కనిపించే మొక్కలను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఒంగోలులో గురువారం చోటుచేసుకుంది. నిందితుల నుంచి 9.8 కిలోల ఇంద్రజాల, 0.286 కిలోల మహేంద్రజాల మొక్కలు, 6 శంఖాలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితుల సమాచారం‌ మేరకు మొక్కలు సరఫరా చేసిన వ్యక్తిని ఒంగోలులో పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద 6.64 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు

News January 2, 2025

ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు ఇంచార్జ్ ఆర్ఎం ఎవరంటే?

image

ప్రకాశం జిల్లా పొగాకు బోర్డు దక్షిణాది ప్రాంతీయ ఇన్‌ఛార్జ్ రీజనల్ మేనేజర్‌గా బి. సుబ్బారావు నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ఆర్ఎంగా ఉన్న లక్ష్మణ రావు కృష్ణ శ్రీ మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ప్రస్తుతం గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్న సుబ్బారావుకు ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు.

News January 2, 2025

బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య

image

బాపట్ల జిల్లా నగరం మండలం చిన్నమట్లపూడిలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన లుక్క నాగరాజు (43)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగరాజు భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేపల్లె గ్రామీణ సీఐ సురేశ్ బాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.