News June 26, 2024

పర్చూరు: మహిళా కానిస్టేబుల్‌కు వేధింపులు.. కేసు నమోదు

image

పర్చూరు ప్రాంతానికి చెందిన వివాహిత కందుకూరులో మహిళ పోలీసుగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త యూపీ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ జవాన్‌గా ఉద్యోగం చేస్తున్నారని వెల్లడించారు. ఇటీవల తరచూ భర్త తనను బెదిరించడంతో పాటు, వేధిస్తున్నాడని ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.

Similar News

News June 29, 2024

రామతీర్థంలో క్రీస్తు శకం మూడవ శతాబ్ది బౌద్ధ ఆనవాళ్లు

image

చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరాలయంలో క్రీస్తు శకం మూడవ శతాబ్దం నాటి బౌద్ధఆనవాళ్లను గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఇటీవల రామతీర్థం ఆలయ పరిసరాల్లో జరిపిన అన్వేషణలో ఆలయం వెనుక వైపు నిర్లక్ష్యంగా పడి ఉన్న శివలింగాల మధ్య పలనాటి సున్నపు రాతి బౌద్ధ స్తంభాన్ని దానిపైన అర్ధచంద్రాకార పద్మాన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.

News June 29, 2024

చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ సస్పెండ్

image

చీమకుర్తిలో జనరల్ ఎలక్షన్లో భాగంగా చీమకుర్తికి వచ్చిన CI దుర్గాప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఇటీవల చీమకుర్తి MRO ఆఫీస్ వద్ద ఓ దొంగతనం కేసులో ముద్దాయి బెయిల్‌పై బయటకు వెళ్లి మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతని దగ్గర లంచం తీసుకొని స్టేషన్ బెయిల్ ఇప్పించినట్లు అభియోగాలు రాగా..  విచారణ జరిపి ఉన్నతాధికారులు నేరం రుజువు కావడంతో సస్పెండ్ చేశారు.

News June 29, 2024

చీరాల: కేసును చేధించిన పోలీసులకు ప్రశంసా పత్రాలు

image

చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువతి అత్యాచారం కేసును బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో 36 గంటల్లోనే ఛేదించారు. ఆ కేసును త్వరితగతిన ఛేదించడంలో కృషి చేసిన 21 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. క్లూస్ లేనప్పటికీ, కేసును సవాల్‌గా తీసుకొని త్వరితగతిన ఛేదించారని అన్నారు.