News April 15, 2024

పర్చూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

పర్చూరులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పర్చూరు నుంచి పెద్దివారిపాలెం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న రావి విజయ భాస్కర్‌ని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన ఇరువురిని 108లో గుంటూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో విజయ భాస్కర్‌ మృతి చెందగా, మరొక వ్యక్తి చికిత్స పొందుతున్నారు.

Similar News

News April 22, 2025

ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 22, 2025

S.N పాడు: అధ్యాపక పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు

image

సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

error: Content is protected !!