News October 29, 2025
పర్చూరు: వరదలో చిక్కుకున్న 20 మంది

తుఫాను కారణంగా పర్చూరు వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు సమీపంలో ఉన్న ఓ ప్రార్థన మందిరంలో 20 మంది చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీసులు స్థానికుల సహకారంతో సురక్షితంగా బయటకు తెచ్చారు. వరదలో చిక్కుకున్న 20 మంది సురక్షితంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News October 29, 2025
NGKL: డిండి మైనర్ బ్రిడ్జిని పరిశీలించిన జిల్లా ఎస్పీ

జిల్లాలోని డిండి ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న మైనర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారడంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. పరిశీలించిన అనంతరం స్థానిక పోలీసులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బ్రిడ్జిపై రాకపోకలను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
News October 29, 2025
ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
News October 29, 2025
అధికారులు సమన్వయనంతో పని చేయాలి: మంత్రి ఉత్తమ్

మొంథా తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


