News December 30, 2025
పర్యాటకులతో కిక్కిరిసిన విశాఖ.. జనవరి 4 వరకు ఇదే పరిస్థితి!

విశాఖ నగరానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. నూతన సంవత్సరం, వరుస సెలవుల నేపథ్యంలో లక్షల సంఖ్యలో పర్యాటకులు విశాఖకు తరలివచ్చారు. నగరంలో ఉన్న 30 స్టార్ హోటళ్లలోని 2,400 గదులు, అలాగే బడ్జెట్ హోటళ్లలోని దాదాపు 5,000 గదులు 90 శాతం ఆక్యుపెన్సీతో నిండిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్ కార్తీక్ తెలిపారు.
Similar News
News January 3, 2026
ఫిబ్రవరి 7,8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలు: కలెక్టర్

పల్నాడు జిల్లా ప్రముఖ పర్యాటక కేంద్రం కొండవీడు కోట ఖ్యాతి రాష్ట్రం నలుమూలలా వ్యాపించేలా ఫిబ్రవరి 7,8 తేదీల్లో అట్టహాసంగా ఉత్సవాలు నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొండవీడు ఫెస్ట్ నిర్వహణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం నోడల్ అధికారిగా జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియని నియమించారు.
News January 3, 2026
చిత్తూరు: పరీక్ష కేంద్రాలు ఇవే

ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు జిల్లాలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు డిఆర్ఓ మోహన్ కుమార్ శనివారం తెలిపారు. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.1. ఆర్‌వీఎస్ నగర్లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల, 2. పలమనేరు మదర్ తెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల, 3. చిత్తూరు మురకంబట్టులోని శ్రీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 4. కుప్పం ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
News January 3, 2026
ఏలూరు: పోస్టుల అభ్యంతరాలకు ఈనెల 6తో ఆఖరు

ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏడాది కాలపరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయనున్న స్టోర్ కీపర్, జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టుల మెరిట్ జాబితాను శనివారం విడుదల చేశారు. వివరాలను https://eluru.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ సావిత్రి తెలిపారు. అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే ఈనెల 6 సాయంత్రం 5 గం:లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


