News September 27, 2025

పర్యాటక కేంద్రంగా ప.గో జిల్లా- నేడు టూరిజం డే

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. తణుకులో స్టార్ హోటల్ నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేశారు. మొగల్తూరు మండలం పేరుపాలెం సముద్రం తీరా వెంబడి రిసార్ట్స్ పేరుతో నిర్మిస్తున్న అతిథి గృహాలకు గతంలో ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని కేటాయించింది. ఉండిలో ఫిష్ ఆంధ్ర అక్వేరియం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News September 27, 2025

ఇంటర్‌లో ఇకపై బయాలజీ పేపర్ మాత్రమే: డిఐఈఓ ప్రభాకర్

image

గతంలో వేర్వేరుగా ఉండే బోటనీ, జువాలజీ సబ్జెక్టులు ఈ ఏడాది నుంచి బయాలజీ పేరుతో ఒకే పేపర్‌ నిర్వహించబడుతుందని జిల్లా ఇంటర్మీడియేట్‌ విద్యా అధికారి జి.ప్రభాకర్‌ తెలిపారు. జిల్లాలోని బోటనీ, జువాలజీ అధ్యాపకులకు తణుకు ఎస్‌ఎన్‌వీటీ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శనివారం ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సబ్జెక్టులో మార్కులు ఎక్కువ రావడానికి అధ్యాపకులు సమన్వయం చేసుకుని సమష్టి కృషి చేయాలని కోరారు.

News September 27, 2025

కాళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు

image

గడచిన 24 గంటల వ్యవధిలో పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల 7.6, పెంటపాడు 4.6, ఇరగవరం 3.6, తణుకు 3.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా జిల్లాలో పాలకోడేరు, మొగల్తూరు, ఆచంట, యలమంచిలి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని వెల్లడించారు.

News September 27, 2025

ధాన్యం కొనుగోలుకు సిద్ధం కావాలి: జేసీ

image

జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025-26లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. స్థానిక భారతీయ విద్యా భవన్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.