News September 27, 2024

పర్యాటక దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్ శంకర్

image

ప్రఖ్యాత గండికోట వేదికగా రేపు జరగబోయే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం నిర్వహించే వేడుకలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో పాటు ప్రతినిధులు పాల్గొంటారని జిల్లాలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కలెక్టర్ తెలిపారు. ప్రజల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Similar News

News December 24, 2025

కడప: కడప జిల్లాలో మద్యం తెగ తాగారు

image

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 15 నాటికి 16,94,210 కేసుల మద్యం తాగేశారు. IML లిక్కర్ 11,23,146, బీరు 5,71,084 కేసులు తాగారు. కడపలో 4,65,420, ప్రొద్దుటూరులో 2,81,597, బద్వేల్‌లో 1,89,549, జమ్మలమడుగులో 1,19,417, ముద్దనూరులో 65,812, మైదుకూరులో 1,80,786, ప్రొద్దుటూరులో 2,81,597, పులివెందులలో 1,89,201, సిద్ధవటంలో 71,296, ఎర్రగుంట్లలో 1,31,152 కేసులు విక్రయించారు. గత ఏడాది 12,97,130 తాగారు.

News December 24, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

image

ప్రొద్దుటూరులో బుధవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.14,050
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,926
☛ వెండి 10 గ్రాముల ధర: రూ.2,240

News December 24, 2025

పులివెందులలో ఇవాళ జగన్ పర్యటన వివరాలు

image

మాజీ సీఎం జగన్ ఇవాళ్టి పర్యటన వివరాలను వైసీపీ వర్గాలు బుధవారం తెలిపాయి. ఉదయం 9:30కు పులివెందుల నుంచి బయలుదేరి 10:30కి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకుంటారు. అక్కడ 1:00 గంట వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 2 గంటలకు పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకొని రాత్రి 7 గంటల వరకు ప్రజలను కలుస్తారు. అనంతరం నివాసానికి వెళతారు.