News October 26, 2025

పర్యాటక ప్రాంతాలకు రావద్దు: డీఎస్పీ సహబాజ్ అహమ్మద్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో టూరిస్టులు ఎవ్వరూ పర్యాటక ప్రాంతాలకు రావద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని పాడేరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సహబాజ్ అహమద్ కోరారు. తుఫాన్ ప్రభావంతో పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి, తారాబు, కిటిక, సరియా జలపాతాలు, డుంబ్రిగుడ చాపరాయికి ప్రవేశం నిషేధమన్నారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకూ అందరూ సహకరించాలని డీఎస్పీ కోరారు.

Similar News

News October 26, 2025

చల్వాయి, గోవిందరావుపేట షాపులకు డ్రా నిలిపివేత..!

image

ములుగు జిల్లాలోని చల్వాయి, గోవిందరావుపేట మద్యం దుకాణాలకు డ్రాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భూపాలపల్లి ఈఎస్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలోని షాపులకు డ్రా జరుగుతోందని, కానీ ప్రోహిబిషన్& ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వులు మేరకు ఈ రెండు దుకాణాలకు డ్రా నిలిపివేసినట్లు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని తెలిపారు.

News October 26, 2025

తుఫాన్‌ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

image

మొంథా తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 27, 28, 29వ తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం మన్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News October 26, 2025

కోటబొమ్మాళి: బావిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

image

కోటబొమ్మాళి మండలం ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరి నాయుడు ఆదివారం బావిలో పడి మరణించాడు. స్థానికుల వివరాల మేరకు.. గౌరి నాయుడు ఆదివారం బావిలోకి స్నానం చేసేందుకు దిగి అస్వస్థతకు గురయ్యాడు. 108లో ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.