News December 22, 2025
పర్యాటక ప్రాంతాల వివరాలు పంపండి: ఖమ్మం కలెక్టర్

అన్ సీన్ పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో సోమవారం 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ కాంటెస్ట్ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. నేచర్, వైల్డ్ లైఫ్, హెరిటేజ్, వాటర్ బాడీస్, స్పిరిచువల్, అడ్వెంచర్, ఆర్ట్ అండ్ కల్చర్ వంటి విభాగాల్లోని ప్రదేశాల వివరాలను జనవరి 5లోపు పంపాలని సూచించారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.
Similar News
News December 25, 2025
మెడికల్ ఆఫీసర్ అభ్యంతరాలకు 27 వరకు గడువు

జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖమ్మం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న నాలుగు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు DM&HO తెలిపారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత ధ్రువపత్రాలతో DM&HO కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News December 25, 2025
అంబేడ్కర్ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు 27 వరకు

ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ ప్రభుత్వ కళాశాల అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ డాక్టర్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో జనవరి 7 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించవచ్చన్నారు.
News December 24, 2025
సాగర్ కాలువలో విషాదం.. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం

ఖమ్మం: సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థులలో ఒకరి ఆచూకీ దొరికింది. కొద్దిసేపటి క్రితం గాలింపు చర్యల్లో భాగంగా అబ్దుల్ సుహాన్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


