News March 12, 2025

పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి: అన్నమయ్య కలెక్టర్

image

జిల్లాలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లాలోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలకు రహదారుల నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News November 15, 2025

అబార్షన్ అయినా లీవ్ తీసుకోవచ్చు

image

మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్‌ అయినా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే దీనికి తగిన డాక్యుమెంట్లు చూపించాలి. అబార్షన్‌ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.

News November 15, 2025

వీడీవీకే స్టాల్స్ పరిశీలించిన మంత్రి సంధ్యారాణి

image

పార్వతీపురం మన్యం జిల్లా వన్ ధన్ వికాస కేంద్రాల స్టాల్స్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరిశీలించారు. శనివారం ట్రైఫెడ్‌ ఆధ్వర్యంలో రుషికొండ వద్ద జరుగుతున్న గిరిజన స్వాభిమాన ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఇక్కడ పార్వతీపురానికి చెందిన జీడి ప్రాసెసింగ్ యూనిట్‌ను, పాచిపెంట వీడీవీకే ద్వారా ఏర్పాటు చేసిన మిల్లెట్స్‌‌ స్టాల్‌ను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని డీపీఎం శ్రీరాములు తెలిపారు.

News November 15, 2025

రెబ్బెన: యాక్సిడెంట్.. కానిస్టేబుల్ మృతి

image

రెబ్బెన మండలం కైరిగాం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తిర్యానికి చెందిన సివిల్ కానిస్టేబుల్ రాము శనివారం ఉదయం మృతి చెందినట్లు రెబ్బెన SI వెంకటకృష్ణ తెలిపారు. ఈ నెల 13న కైరిగాం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రాము తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందినట్లు SI వెల్లడించారు.