News March 17, 2025
పర్యాటక రంగంలో జిల్లాను అభివృద్ధి చేయాలి: సిర్పూర్ MLA

పర్యాటక రంగంలో వెనుకబడి ఉన్న ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి చేయాలని సిర్పూర్ MLA హరీశ్ బాబు కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. అడవులు, ప్రాజెక్టులు విరివిగా ఉన్న జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఉపాధి కల్పించాలని, జిల్లాలో రూరల్ టూరిజం, ఆడ ప్రాజెక్టులో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. వాటితో పాటు హరిత హోటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.
Similar News
News July 9, 2025
ఏలూరు: 14న 2,500 ఉద్యోగాలకు జాబ్ మేళా

వట్లూరులోని CR రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జులై 14న ఎంపీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్రబాబు బుధవారం తెలిపారు. సుమారు 2,500 ఉద్యోగ ఖాళీలకు ఈ మేళా నిర్వహిస్తున్నామన్నారు. 18-35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీటెక్ విద్యార్హతలు ఉండాలన్నారు. వివరాలకు 8143549464 సంప్రదించాలి.
News July 9, 2025
కామారెడ్డి: రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

KMR జిల్లాలో కొన్ని రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రైతులు వరినాట్లు వేసుకోగా.. మరికొందరు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. KMR జిల్లాలో గతేడాది 3,16,242 ఎకరాల్లో వరి పండించగా ఈ ఏడాది 3,18,530 ఎకరాల్లో పండించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పత్తి గతేడాది 34,459 ఎకరాల్లో పండించగా ఈ ఏడాది 34,549 ఎకరాల్లో పండించవచ్చని పేర్కొన్నారు.
News July 9, 2025
రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. డి.ఇ.ఓ. కె.వాసుదేవరావు ఆధ్వర్యంలో 100 మంది శాశ్వత సభ్యులు రెడ్ క్రాస్లో చేరారు. వీరికి సంబంధించిన రూ.1,10,000 చెక్కును జిల్లా కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు పి. ప్రశాంతి ద్వారా తూర్పు విభాగం రెడ్ క్రాస్ ప్రతినిధి మహాలక్ష్మికి అందజేశారు.